సింగర్ సెలెనా గోమెజ్.. బైపోలార్ డిజార్డర్‌తో బాధ పడుతున్నట్లు తెలిపింది. తన తోటి సహచరి డిస్నీ స్టార్ మిలే సైరస్‌తో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
"నేను ఇటీవలే ప్రపంచంలోని అత్యుత్తమ మానసిక ఆసుపత్రులలో ఒకదానికి వెళ్లా. కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత బైపోలార్ డిజార్డర్ గురించి గ్రహించాను. అందువల్ల దీని సమాచారం తెలుసుకోవటం వల్ల అది నాకు మరింత సహాయపడుతుందని భావించాను. నాకు తెలిసి అది నన్ను భయపెట్టదు. దాని గురించి తెలిసిన తర్వాత అభిమానులు భయపడతారని అనుకుంటున్నా."
- సెలెనా గోమెజ్, గాయని
సెలెనా గోమెజ్.. తన మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకునే చర్యను ఓ చిన్ననాటి జ్ఞాపకంతో పోల్చుకుంది. "నా చిన్నతనంలో ఉరుములకు భయపడ్డాను. ఉరుములకు సంబంధిన విషయాల పుస్తకాలను కొని మా అమ్మ వాటి గురించి వివరించింది. అలాగే ఏ విషయంపై అయినా అవగాహన కల్పిస్తే మీరు భయపడరు" అని ఆమె తెలిపింది.
డిస్నీ స్టార్ మిలే సైరస్ 'బ్రైట్ మైండెడ్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రముఖులతో లైవ్ చాట్ సెషన్ నిర్వహించి వారిని ఇంటర్వ్యూ చేస్తుంది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో సింగర్ సెలెన్ గోమెజ్ పాల్గొంది.
ఇదీ చూడండి..'ఐసోలేషన్షిప్'లో నటి ఊర్వశి అందాలు