నటిగా, వ్యాఖ్యాతలుగా యువత మనసుదోచే అందాల భామలు రష్మి గౌతమ్, వర్ష. బుల్లితెరపై వాళ్లకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'ఈటీవీ'లో ప్రసారమయ్యే పలు షోలలో వ్యాఖ్యాతలుగా చేస్తూనే అప్పుడప్పుడు వాళ్లు ఇచ్చే డ్యాన్స్ పెర్ఫామెన్స్‌లు మతిపోగొడతాయి. ఇప్పుడు వీరిద్దరూ తనదైన డ్యాన్స్ ప్రదర్శనతో అలరించారు.
అల్లు అర్జున్ కొత్త సినిమా 'పుష్ప'. ఇందులో 'ఊ అంటావా మావ' పాటలో సమంత ఆడిపాడింది. ఇప్పుడు అదే పాటకు 'అమ్మమ్మగారి ఊరు' కార్యక్రమంలో నర్తించి మెస్మరైజ్ చేసింది రష్మి. అదే చిత్రంలోని 'సామి సామి' పాటకు వర్ష చేసిన డ్యాన్స్ సైతం అలరించింది.