తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బ్రిటన్​ రాణి​ ఎలిజిబెత్​ 'రహస్య ప్రేమ'పై దుమారం! - Queen Elizabeth web series

బ్రిటన్​ రాణి ఎలిజిబెత్-2 జీవిత కథ ఆధారంగా నెట్​ఫ్లిక్స్​లో "ద క్రౌన్​" పేరిట వెబ్​ సిరీస్​ రానుంది. ఇందులో ఎలిజిబెత్​ మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపించారనే ఎపిసోడ్​ ప్రస్తుతం దుమారం రేపుతోంది.

బ్రిటన్​ రాణి​ ఎలిజిబెత్​ 'రహస్య ప్రేమ'పై దుమారం!

By

Published : Nov 11, 2019, 2:50 PM IST

Updated : Nov 11, 2019, 5:02 PM IST

బ్రిటన్​ రాణి ఎలిజిబెత్​ వ్యక్తిగత జీవిత విశేషాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. ఈ విషయాన్ని సొమ్ము చేసుకునేందుకు నెట్​ఫ్లిక్స్​ సంస్థ ఆమె జీవిత కథ ఆధారంగా "ద క్రౌన్​" అనే వెబ్​ సిరీస్​ రూపొందించింది. క్వీన్​ ఎలిజిబెత్​కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు చిత్రీకరించింది. ఇందులో ఎలిజిబెత్​ పాత్రలో బ్రిటన్​కు చెందిన 2019 ఆస్కార్​ అవార్డు విజేత ఒలీవియా కోల్​మన్​ నటించారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇందులోని ఓ ఎపిసోడ్ చర్చనీయాంశమైంది. ఎలిజిబెత్​ ఒకానొక సమయంలో తన గుర్రపు స్వారీ మేనేజర్ (పోర్చీ)​తో ప్రేమ వ్యవహారం నడిపించారనే అంశం ప్రస్తుతం దుమారం రేపుతోంది. వెబ్​ సిరీస్​పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదాస్పద సిరీస్​లోని ప్రేమ వ్యవహారం ఎపిసోడ్​ వచ్చే ఆదివారం విడుదల కానుంది.

వివాదాస్పద ఎపిసోడ్​పై 'సండే టైమ్స్'​ కథనం ప్రచురించింది. అమెరికా, ఆస్ట్రేలియాలో సుమారు నెల రోజుల పాటు ఆమె గుర్రపు స్వారీ మేనేజర్​ పోర్చీతో గడిపారని ఎపిసోడ్​లో ఉన్నట్లు పేర్కొంది. పోర్చీ 2001లో మరణించే వరకు ఆయనతో ఎలిజిబెత్ సన్నిహితంగా ఉన్నట్లు వివరించింది. కానీ వారి బంధానికి బలపరిచే ఆధారాలేవీ లేవని తెలిపింది.

ఇదో కల్పిత కథ..

ఎలిజిబెత్ రాణి జీవితం ఆధారంగా తెరకెక్కిన వెబ్​ సిరీస్​ను తప్పుపట్టారు ఆమె మాజీ ప్రెస్​ సెక్రటరీ డిక్కీ ఆర్బిటర్​. "అదో కల్పిత కథ.. అందులో నిజాలు లేవు" అని అన్నారు. 1947లో ఫిలిప్​ను ఎలిజిబెత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, అప్పటి నుంచి మరో వ్యక్తిని కన్నెత్తి చూడలేదన్నారు ఆర్బిటర్​.

ఇదీ చూడండి: ఆయనతో సావాసం అంటే ఇలానే ఉంటది..

Last Updated : Nov 11, 2019, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details