తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'టిరియన్​ లానిస్టర్​' బల్లలు శుభ్రం చేస్తున్నాడు..! - tirian lanister

గేమ్​ ఆఫ్ థ్రోన్స్​లో టిరియన్ లానిస్టర్​ పాత్రలో మెప్పించిన పీటర్ డక్లాంజేను పోలిన వ్యక్తి పాకిస్థాన్​లోని రావల్పిండిలో ఉన్నాడు. ఇద్దరూ ఒకెేలా ఉండటం వల్ల చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.

పీటర్

By

Published : May 5, 2019, 6:02 AM IST

Updated : May 5, 2019, 9:49 AM IST

లానిస్టర్​ను పోలిన రోజీఖాన్

మీరు గేమ్​ ఆఫ్ థ్రోన్స్​ చూస్తున్నారా! అందులో టిరియన్ లానిస్టర్ పాత్ర గుర్తుందా! పొట్టిగా ఉండి తన మాటలు, తెలివి తేటలతో ఇతరులను బురిడి కొట్టిస్తూ ఎన్నో సందర్భాల్లో కష్టాల నుంచి తప్పించుకుంటాడు. తాజాగా అతడు పాకిస్థాన్​ రావల్పిండిలోని రెస్టారెంటులో పనిచేస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు​! కంగారు పడకండి ఇక్కడ పనిచేస్తుంది టిరియన్ కాదు అచ్చం అతడి పోలికలతో ఉన్న రోజి ఖాన్.

2011లో ప్రారంభమైన గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​ సిరీస్​లో టిరియన్​ పాత్రను పీటర్​ డక్లాంజే పోషించాడు. పాకిస్థాన్​ రావల్పిండిలోని రెస్టారెంటులో పనిచేస్తున్న రోజి ఖాన్ అచ్చుగుద్దినట్టు పీటర్​లానే ఉన్నాడు. ఆ రెస్టారెంటు యజమాని కొడుకు మాలిక్ అస్లాం చెప్పే దాకా ఖాన్​కు కూడా తెలియదట గేమ్ ఆఫ్ థ్రోన్స్​ నటుడి గురించి. అనంతరం టిరియన్​కు అభిమానిగా మారిపోయాడు ఖాన్.

రోజి ఖాన్​ ఫొటోను ఫేస్​బుక్​లో ​పెట్టాడుమాలిక్. ఇంకేముంది జనాలు ఆ వెయిటర్​తో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తున్నారు. రోజీ ఖాన్, పీటర్​ల పోలికలే కాదు... ఇద్దరి ఎత్తు 1.33 మీటర్లు (4 అడుగుల 5 అంగుళాలు) సమానమే.

పాకిస్థాన్​లోని ఖైబర్ పఖ్తున్​ఖ్వా రాష్ట్రానికి చెందిన ఖాన్.. గేమ్​ ఆఫ్ థ్రోన్స్​ నటుడిని కలిసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అతడితో కలిసి నటించాలని తన మనసులో మాట బయట పెట్టాడు. ఇప్పటికే పాకిస్థాన్​లో​ ఓ వాణిజ్య ప్రకటనలోనూ నటించాడీ టిరియన్​ లానిస్టర్​ డూప్​.

పీటర్ డక్లాంజేలా ఉన్నానని అందరూ నాతో సెల్ఫీలు దిగుతున్నారు. పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో నా ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు నేనెంతో పాపులర్ అయ్యాను. పీటర్​ను కలవాలనుకుంటున్నా. అతడితో కలిసి నటించాలనుకుంటున్నా. -- రోజి ఖాన్​

Last Updated : May 5, 2019, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details