ఏదైనా ఊరికి కొన్నేళ్ల తర్వాత వెళితే పాత థియేటర్లు కనుమరుగైపోవడం ఇప్పుడు సాధారణమైన విషయమే. వాటి స్థానంలో ఏ వాణిజ్య భవనమో దర్శనమిస్తుంది. కానీ గత 123 ఏళ్లుగా సినిమాలు ప్రదర్శిస్తున్న పురాతన థియేటర్ గురించి మీకు తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన థియేటర్
థియేటర్లు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో, ఏకంగా 123 ఏళ్ల నుంచి వాషింగ్టన్లో ఓ హాల్‌ను నడుపుతున్నారు. ఇప్పటికీ ఇందులో సినిమాలు ప్రదర్శిస్తుండటం వల్ల ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన థియేటర్
ఈ థియేటర్ అమెరికాలోని వాషింగ్టన్లో ఉంది. ఈసారి ఎప్పుడైనా అక్కడకి వెళితే 123 ఈస్ట్ వాషింగ్టన్ స్ట్రీట్‌లోని ఈ హాల్లో సినిమా చూడండి.
మొదట్లో 'ద గ్రాహమ్ ఒపేరా హౌస్' అనే పేరుతో 1897 మే 14న దీనిని ప్రారంభించారు. అందులో ఇప్పటికీ సినిమాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. అందుకే ఈ సినిమాహాల్ ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకుంది.