తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తల్లి రుణం తీర్చుకోలేమా..? - WOMEN

నిర్ణీత పనిగంటలు, సెలవులు, ఇంక్రిమెంట్లు లేని ఉద్యోగం గృహిణిది. ఆమె కష్టాన్ని డబ్బు రూపంలో విలువకడితే ఎలా ఉంటుంది అనే అంశంపై సరదాగా తీసిన ఓ షార్ట్​ఫిల్మ్ వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో

By

Published : Mar 10, 2019, 9:56 AM IST

తల్లిరుణం తీర్చుకోలేమా..?

అమ్మ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేం.. చాలా సినిమాలలో హీరో భావోద్వేగంతో చెప్పే డైలాగ్​ ఇది. ఆ రుణాన్ని భావోద్వేగంతో కాకుండా డబ్బులో లెక్కగట్టి చూస్తే నిజంగానే ఆ అప్పును మనం ఈ జన్మలో తీర్చలేం. ఈ అంశంపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సరదాగా తీసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. చూసేటప్పుడు నవ్వు తెప్పిస్తున్నా.. తర్వాత హృదయాన్ని గట్టిగా తాకుతోంది.

జోయితా రాయ్, అభినీత్ మిశ్రా నటించిన ఈ సెటైరికల్ కామెడీ వీడియో, వినోదంతో పాటు సందేశాన్నీ తెలియజేసింది. భారతదేశంలో ఉద్యోగినుల కంటే గృహిణులే ఎక్కువ మంది ఉంటారు. వారి కష్టాన్ని ఎవరూ డబ్బుతో లెక్కకట్టరు. సరదాగా ఆ కష్టాన్ని ద్రవ్యరూపంలో గణిస్తే ఎలా ఉంటుందో షార్ట్​ఫిల్మ్​ రూపంలో చూపించారు.

నిర్ణీత పనిగంటలు, సెలవులు, ఇంక్రిమెంట్లు లేని ఉద్యోగం గృహిణిది. పిల్లల ఆలనాపాలనా, వారి చదువులు, వంటావార్పులు ఇవన్నీ కాలానుగుణ మార్కెట్ ధరలలో గణిస్తే ఆ డబ్బు తడిసి మోపెడవుతోంది. ఈ అంశాలన్నీ స్పృశిస్తూ స్త్రీ ఔన్నత్యాన్ని చాటిచెప్పారు.

మన దేశ జీడీపీ(స్థూల దేశియోత్పత్తి)లో మహిళల వాటా 17 శాతం మాత్రమే. ఇది ప్రపంచ సగటు 37శాతం కంటే చాలా తక్కువ. లింగసమానత్వాన్ని అనుసరించి గృహిణుల కష్టానికి విలువ కడితే.. 2025 నాటికి భారత జీడీపీ 16 శాతం పెరుగుతుంది. ప్రపంచ దేశాల జీడీపీ 12 ట్రిలియన్ డాలర్లు దాటుతుంది అని 2017లో మికిన్సే నివేదిక తెల్చింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details