తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​-'25' - release

సింగపూర్ 'మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం'​లో మార్చి 25న మహేశ్ విగ్రహం ఆవిష్కరించనున్నారు. ఏప్రిల్ 25న 'మహర్షి' చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం ప్రిన్స్ 25వ సినిమా. ఇలా అనుకోకుండానే '25' అంకె మహేశ్​కు ప్రత్యేకంగా మారింది.

మహేశ్

By

Published : Mar 1, 2019, 1:20 PM IST

నెల రోజుల వ్యవధిలో అభిమానులకు రెండు ఆనందాలు పంచబోతున్నాడు టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్​బాబు. సింగపూర్ 'మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం'లో మార్చి 25న మహేశ్ విగ్రహం ఆవిష్కరించనున్నారు. ఏప్రిల్ 25న 'మహర్షి' చిత్రం విడుదల కానుంది.

గతేడాది మేడమ్ టుస్సాడ్స్​ బృందం సింగపూర్ నుంచి వచ్చి మైనపు బొమ్మ కోసం మహేశ్ కొలతలను తీసుకుంది. మార్చి 25న విగ్రహం ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం మహేశ్ మహర్షి చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు పాటల మినహా చిత్రీకరణ పూర్తయింది. గతంలో మహేశ్ నటించిన 'పోకిరి', 'భరత్ అనే నేను' చిత్రాలూ ఏప్రిల్​లోనే విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి.

మహర్షిలో పూజా హెగ్దే, సోనల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లరినరేశ్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్నిదిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి. పోట్లూరి నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాత్ సంగీతం అందిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details