తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వైట్ వాకర్స్ సిద్ధం.. - release

ఇప్పటివరకు 7 భాగాలుగా వచ్చిన 'గేమ్​ ఆఫ్ థ్రోన్స్' సిరీస్ ఆఖరి భాగం కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

గేమ్​ ఆఫ్ థ్రోన్స్ 8

By

Published : Mar 6, 2019, 10:14 AM IST

Updated : Mar 6, 2019, 11:38 AM IST

గేమ్​ ఆఫ్ థ్రోన్స్... ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న ఈ అమెరికన్ సిరీస్​లో చివరిదైన ఎనిమిదో సీజన్ ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉన్న ఈ ప్రచార చిత్రం సినీప్రియుల్ని అలరిస్తోంది. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ వెబ్ సిరీస్.

ఇప్పటివరకు 7 భాగాలుగా వచ్చిన 'గేమ్​ ఆఫ్ థ్రోన్స్' సిరీస్ ఆఖరి భాగం కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. తొలి సీజన్ 2011లో విడుదలైంది. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ సిరీస్ ఆకట్టుకునే గ్రాఫిక్స్, పోరాటాలతో ప్రేక్షకులకి వినోదాన్నందించింది.

2017లో ఏడో భాగం విడుదల కాగా.. ఉత్కంఠ సన్నివేశాలతో మలుపులు తిప్పుతుందీ వెబ్​ సిరీస్. ఎమిలీ క్లార్క్, కిట్​హారింగ్టన్,లినా హెడే ప్రధాన పాత్రధారులగా తెరకెక్కిన ఈ సిరిస్​ను జార్జ్ మార్టిన్ నవల 'ఏ సాంగ్ అండ్ ఐస్ అండ్ ఫైర్' ఆధారంగా తీశారు.

Last Updated : Mar 6, 2019, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details