ప్రతి పండగకు ప్రత్యేక షోలు నిర్వహించి, తెలుగు ప్రజల్ని అలరించే ప్రముఖ ఛానెల్ ఈటీవీ.. ఈసారి 'ఊరిలో వినాయకుడు' పేరుతో ప్రోగ్రాం ప్లాన్ చేసింది. సుడిగాలి సుధీర్ పవన్ 'భీమ్లా నాయక్' గెటప్‌లో అలరిస్తూ, ఎపిసోడ్‌పై అంచనాలు పెంచుతున్నారు.
వినాయకచవితికి సుధీర్ 'భీమ్లా నాయక్' సందడి - ఈటీవీ జబర్దస్త్
ఈసారి వినాయకచవితి మరింత సందడిగా జరుపుకొనేందుకు ఈటీవీ సిద్ధమైంది. 'ఊరిలో వినాయకుడు' ప్రోగ్రాం ప్రోమో యూట్యూబ్‌లో సందడి చేస్తూ, ఎపిసోడ్‌పై అంచనాల్ని పెంచుతోంది.
సుధీర్ రష్మి
వీరితో పాటు హీరో శ్రీకాంత్, సుశాంత్, రాజ్‌తరుణ్ సహా నటుడు అజయ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన తొలి ప్రోమో ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. సెప్టెంబరు 10న వినాయకచవితి రోజు పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ఇవీ చదవండి: