Ammamma gari ooru promo: ఈటీవీలో ఈసారి సంక్రాంతికి ప్రసారమయ్యే స్పెషల్ షో 'అమ్మమ్మ గారి ఊరు'. ఇప్పటికే దీనికి సంబంధించిన పలు ప్రోమోలు సందడి చేస్తుండగా, బుధవారం కొత్త ప్రోమో రిలీజ్ చేశారు.
ఇందులో భాగంగా నటి అన్నపూర్ణమ్మ పిండి వంటలు చేస్తూ, అందరిపై పంచులు వేస్తూ అలరించారు. ఈ మధ్య యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టించిన సమంత 'ఊ అంటావా ఊహు అంటావా' పాటకు డ్యాన్స్ చేసిన యాంకర్ రష్మీ.. స్టేజీపై హీట్ పెంచేసింది.