తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నేను అలాంటి వాళ్లనే ప్రేమిస్తా: ఆర్జీవీ - extra jabardast promo

Etv new year program 2022: తాను ఎలాంటి వాళ్లను ప్రేమిస్తాడో డైరెక్టర్ రామ్​గోపాల్ వర్మ చెప్పేశారు. ఈటీవీ న్యూ ఇయర్ ఈవెంట్​లో ఈ విషయాన్ని వెల్లడించారు.

rgv etv programme
రామ్​గోపాల్ వర్మ

By

Published : Dec 30, 2021, 7:56 PM IST

RGV etv new year event: ఈసారి న్యూ ఇయర్​ సందర్భంగా ఈటీవీలో 'పెళ్లాం వద్దు పార్టీ ముద్దు' అనే స్పెషల్ ఈవెంట్​ ప్లాన్ చేశారు. శుక్రవారం రాత్రి 9:30 గంటలకు ఇది ప్రసారం కానుంది. ఈ ప్రోగ్రాం కొత్త పోమో రిలీజ్ చేశారు. ఇది అలరిస్తూ ఆత్రుతను కలిగిస్తోంది.

ఈ ఈవెంట్​కు స్టార్ డైరెక్టర్ రామ్​గోపాల్ వర్మ ముఖ్యఅతిథిగా వచ్చారు. ఆయన తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకుల్ని నవ్వించారు. 'ఆర్జీవీ గ్యారేజ్' పేరుతో ఆయనతో కలిసి హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ స్కిట్ కూడా చేశారు. ఇందులో భాగంగా ఇమ్మాన్యుయేల్ వర్ష వస్త్రధారణపై ఫిర్యాదు చేయగా, తాను మోడ్రన్ డ్రస్​లు వేసుకున్న వారినే ప్రేమిస్తానని ఆర్జీవీ చెప్పారు.

డైరెక్టర్ ఆర్జీవీ

యాంకర్ రష్మి.. స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్​తో అదరగొట్టింది. ఈ ఈవెంట్​కు ఆర్జీవీతో పాటు వరుణ్ సందేశ్ దంపతులు, పలువురు టీవీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. 'నేను హ్యాపీ న్యూ ఇయర్ నమ్మను. కానీ మీలాంటి మూర్ఖులందరూ నమ్ముతారు కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్' అంటూ సెటైర్​ వేశారు ఆర్జీవీ.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details