శ్రవణ్ రాఘవేంద్ర కథానాయకుడిగా పరిచయమవుతున్న ఎదురీత చిత్రం టీజర్ విడుదలైంది. నందమూరి కల్యాణ్ రామ్ టీజర్‌ను విడుదల చేశారు. లియోనా లిషోయ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి బాలమురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు.
"ఎదురీత" టీజర్ విడుదల
సై, దూకుడు, శ్రీమంతుడు, బిందాస్, మగధీర, లాంటి సినిమాల్లో ప్రతినాయకుడిగా మెప్పించిన శ్రవణ్ రాఘవేంద్ర.. హీరోగా ఎదురీత చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ విడుదలైంది.
ఎదురీత టీజర్
సై, దూకుడు, శ్రీమంతుడు, బిందాస్, మగధీర, ఏక్ నిరంజన్ సినిమాల్లో ప్రతినాయకుడిగా మెప్పించాడు శ్రవణ్. ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తండ్రీ- కొడుకుల నేపథ్యంలో కథ ఉంటుందని కథానాయకుడు శ్రవణ్ తెలిపారు.
ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమలో సంపత్ రాజ్, జియా శర్మ, పృథ్వీ తదితరులు నటిస్తున్నారు. అరల్ కొరెల్లి సంగీతమందించిన ఈ చిత్రానికి బోగారి లక్ష్మీనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.