Dhee 13 Kings vs Queens: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేసిన 'ఢీ: కింగ్స్ వర్సెస్ క్వీన్స్' గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజైంది. అదిరిపోయే డ్యాన్స్‌లతో పలువురు కంటెస్టెంట్లు ప్రేక్షకులను అబ్బురపరిచారు. వీరికి తోడు సుధీర్-ప్రదీప్-ఆది చేసిన కామెడీ తెగ నవ్విస్తోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన కామెడీ టైమింగ్‌తో పంచ్‌లు వేస్తూ అలరించారు. ఈ పూర్తి ఎపిసోడ్.. డిసెంబరు 8న రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.
అల్లు అర్జున్‌తో నటించే అవకాశం తనకు రానందుకు బాధపడుతున్నానని ప్రియమణి అన్నారు. దీనికి స్పందిస్తూ.. 'వర్క్ చేయలేదని అనుకోవద్దు. ఇప్పటికీ ఛాన్స్ ఉంది. ఇప్పుడైనా చేయొచ్చు. పైగా ఇప్పుడు మొత్తం సన్నబడి మంచి హాట్‌గా తయారయ్యావ్' అని బన్నీ కామెంట్ చేసి నవ్వులు పూయించారు.