బ్లాక్‌బస్టర్ చిత్రం పద్మావత్ అనంతరం బాలీవుడ్ నటి దీపికా పదుకొనె కొత్త చిత్రం ఛపాక్. ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా సోమవారం ప్రారంభమైంది. ఈ సినిమా తొలిరూపు విడుదలైంది. యాసిడ్ దాడికి గురైన మాలతి అనే యువతి పాత్రలో నటిస్తోంది దీపికా. ఈ చిత్రం 2020 జనవరి 10న ప్రేక్షకులముందుకు రానుంది.
యాసిడ్దాడి బాధితురాలిగా దీపిక:ఛపాక్ తొలిరూపు - ఛాపక్
బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె కొత్త చిత్రం ఛపాక్. ఇందులో యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో నటిస్తోంది దీపిక.
దీపికా పదుకొనే
పోస్టర్లో దీపికా యాసిడ్ దాడికి గురైన యువతిలా కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం దీపిక చాలా కష్టపడిందని అర్థమవుతోంది. విక్రాంత్ మాస్సే సహనటుడిగా నటిస్తున్నారు. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తోంది.
రాజీ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు మేఘనా గుల్జార్. ఈ చిత్రానికి ఆమెకు ఉత్తమ దర్శకురాలిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. ఫిల్హాల్, జస్ట్ మ్యారిడ్, తల్వార్ లాంటి సినిమాలను తెరకెక్కించి ఆకట్టుకున్నారు మేఘనా.
Last Updated : Mar 25, 2019, 12:47 PM IST