తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కూతురు కావాలంటే హత్యలు చేయాల్సిందే! - Breathe 2 Abhishek Bachchan

ప్రముఖ నటులు అభిషేక్ బచ్చన్, నిత్యామేనన్ ప్రధాన పాత్రలు పోషించిన 'బ్రీత్' వెబ్ సిరీస్​ రెండో సీజన్​ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రతి సన్నివేశం సిరీస్​పై అంచనాల్ని పెంచుతోంది.

కూతురు కావాలంటే హత్యలు చేయాల్సిందే!
బ్రీత్ రెండో సీజన్ ట్రైలర్

By

Published : Jul 1, 2020, 3:30 PM IST

ఆసక్తిరేకెత్తిస్తున్న 'బ్రీత్' వెబ్​సిరీస్ సీజన్​2 ట్రైలర్ విడుదలైంది. కిడ్నాప్​ అయిన కుమార్తెను విడిపించేందుకు, హత్యలు చేసే తండ్రిగా బాలీవుడ్​ ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్ కనిపించనున్నారు. అతడి భార్యగా నిత్యామేనన్ నటించింది. వీరిద్దరూ ఈ సిరీస్​తోనే డిజిటల్​ అరంగేట్రం చేస్తుండటం విశేషం. జులై 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుంది.

కథేంటి?

అవినాష్, అభా సబర్వాల్​లు(అభిషేక్ బచ్చన్, నిత్యామేనన్) తప్పిపోయిన తమ కూతురు సియా కోసం వెతుకుతుంటారు. అయితే కిడ్నాపర్​ డబ్బులేం అడగకుండా, కొందరిని హత్య చేయాలని అవినాష్​కు చెబుతాడు. ఈ క్రమంలో కథ ఎన్ని మలుపులు తిరిగింది అనేదే 'బ్రీత్ 2'.

తొలి సీజన్​లో నటించిన అమిత్ సాద్.. ఇందులోనూ పోలీస్​గా కనిపించనున్నారు. అభిషేక్ బచ్చన్ సైకియాట్రిస్ట్ పాత్ర పోషించారు. వీరితో పాటే సయామీ ఖేర్, ప్లాబితా బోర్తాకుర్, హృషికేష్ జోషి ఇతర పాత్రల్లో కనువిందు చేయనున్నారు. మయాంక్ శర్మ.. ఈ సీజన్​కు దర్శకత్వం వహించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details