హాలీవుడ్లో సమ్మే సైరన్(hollywood strike 2021) మోగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇండస్ట్రీలో తెరవెనక పనిచేసే 60వేల మంది స్ట్రైక్ సిద్ధమవుతున్నారు. వీరి యూనియన్ ఐఏఎస్టీఈ(ఇంటర్నేషనల్ అలయన్స్ ఆఫ్ థియేట్రికల్ స్టేజ్ ఎంప్లాయిస్).. హాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా ఆందోళనలకు సన్నద్ధమవుతోంది(hollywood strike iatse). ఇందుకు కారణాలు లేకపోలేదు.(hollywood news today)
ఐఏఎస్టీఈ అంటే? స్ట్రైక్ ఎందుకు?
ఐఏఎస్టీఈకి 128ఏళ్ల చరిత్ర ఉంది. ఇందులో 1,50,00మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, సినిమాటొగ్రాఫర్లు, కాస్ట్యూమర్లు, సెట్ డిజైనర్లు, స్క్రిప్ట్ సూపర్వైజర్లు, హెయిర్-మేకఅప్ ఆర్టిస్టులు, యానిమేటర్లతో పాటు ఇతర విభాగాలకు చెందిన వారెందరో సభ్యులుగా ఉన్నారు. వీరి సహాయం లేకుండా సినిమాల నుంచి టీవీ షోల వరకు ఏవీ జరగవనే చెప్పాలి.
60వేల మంది యూనియన్ సభ్యులు ఆందోళనలకు దిగుతుండటం వెనక ఓ కారణం ఉంది. వీరిని మూడేళ్ల క్రితం కాంట్రాక్ట్ కింద హాలీవుడ్‌లోకి తీసుకున్నారు. అది ఈ ఏడాది జులైలో ముగిసింది. నాలుగు నెలలుగా.. కొత్త కాంట్రాక్టులపై యూనియన్ సభ్యులు, ఏఎమ్పీటీపీ(అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రోడ్యూజర్స్) మధ్య సంప్రదింపులు జరిగాయి. వినోదాత్మక సంస్థలు, హాలీవుడ్ స్టూడీయోలు, స్ట్రీమింగ్ సర్వీసులు, ప్రొడక్షన్ కంపెనీల సమూహం ఈ ఏఎమ్పీటీపీ. కాగా.. సెప్టెంబర్ 20న చర్చలు విఫలమయ్యాయి. పని ప్రదేశాల్లోని సమస్యను పరిష్కరించడంలో ఏఎమ్పీటీపీ విఫలమైందని ఆరోపిస్తూ.. స్ట్రైక్‌కు దిగే విషయంపై సానుకూలంగా ఓటు వేశారు యూనియన్ సభ్యులు(hollywood strike authorization).
ఎక్కువ పని చేయించుకుని, తక్కువ జీతాలు ఇస్తున్నారని యూనియ్ సభ్యులు ఆరోపిస్తున్నారు. పనిగంటల కారణంగా సరైన రెస్ట్ తీసుకునే వీలుకూడా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనేక మంది శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు.
ఐఏఎస్టీఈకి అన్నివైపుల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రముఖ దర్శకులు, నటులు యూనియన్‌కు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. దిగ్గజ దర్శకులు స్టీవెన్ స్పిల్బర్గ్, క్రిస్టొఫర్ నోలాన్ వంటి వారు.. యూనియన్ సభ్యులకు సంఘీభావంగా డైరక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా విడుదల చేసిన ప్రకటనపై సంతకాలు చేశారు. అంతేకాకుండా 118మంది సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు ఏఎమ్పీటీపీకి లేఖ రాశారు. సమస్యలు సకాలంలో పరిష్కారమవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు.