తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జాన్వీ కపూర్​తో కంటిన్యూ కానున్న 'లస్ట్​ స్టోరీస్' - netflix

'లస్ట్ స్టోరీస్' కొనసాగింపుగా రానున్న నెట్​ఫ్లిక్స్​ చిత్రం 'ఘోస్ట్ స్టోరీస్'. జోయా అక్తర్ తెరకెక్కించనున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్, విజయ్​ వర్మ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

ఘోస్ట్ స్టోరీస్

By

Published : Aug 17, 2019, 3:20 PM IST

Updated : Sep 27, 2019, 7:15 AM IST

గతేడాది నెట్​ఫ్లిక్స్​లో 'లస్ట్​ స్టోరీస్' చిత్రంతో ప్రేక్షకులను అలరించింది బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్. ఇప్పుడు ఈ సిరీస్​కు కొనసాగింపుగా 'ఘోస్ట్​ స్టోరీస్'ను తెరకెక్కించనుంది. ఇందులో జాన్వీ కపూర్, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. త్వరలో పట్టాలెక్కనుందీ సినిమా. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

జాన్వీ కపూర్.. జోయాతో మొదటి సారి పనిచేయబోతుంది. విజయ్ ఈ ఏడాది ఆమె దర్శకత్వంలో వచ్చిన 'గల్లీ బాయ్' చిత్రంలో కనిపించాడు. ఈ మూవీలో అతడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

జోయా, కరణ్ జోహర్, దిబాకర్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా 'లస్ట్ స్టోరీస్'​ చిత్రాన్ని రూపొందించారు. ఇంతకుముందు ఈ నలుగురు కలిసి 2013లో వచ్చిన 'బాంబే టాకీస్' సినిమాను తెరకెక్కించారు.

ఇది చదవండి: 'మోస్ట్​ హ్యండ్​సమ్ మ్యాన్'​గా హృతిక్ రోషన్

Last Updated : Sep 27, 2019, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details