యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'రౌద్రం రణం రుధిరం' (ఆర్‌ఆర్‌ఆర్)లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయింది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ' దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నాడని సమాచారం.
యంగ్ టైగర్‌తో అట్లీ.. అభిమానుల్లో భారీ అంచనాలు! - Young Tiger NTR new movie Atlee
జూనియర్ ఎన్టీఆర్.. 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో కలిసి తారక్ ఓ మూవీ చేయనున్నాడని సమాచారం.
కొన్నాళ్లుగా కరోనా వైరస్ కారణంగా అన్ని రకాల సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. అయితే ఈ మధ్యలో ఎన్టీఆర్ మరో కొత్త చిత్రం కోసం ప్రణాళికలు వేసుకుంటున్నాడట. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్టు కోసం తమిళ దర్శకుడు అట్లీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ అవకాశం కోసం తెలుగు దర్శకులు భారీగానే పోటీపడుతున్నారట. మాస్ కథలను తెరకెక్కించడంలో అట్లీది అందెవేసిన చేయని తమిళంలో పేరుంది. ఫలితంగా తారక్-అట్లీ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి కలుగుతోంది. దీనిపై స్పష్టత రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.