తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్​ చివరి సినిమా చూడటం నా వల్ల కాదేమో' - సుశాంత్ జాక్వెలిన్

సుశాంత్ సింగ్ చివరి సినిమా చూడటం తన వల్ల కాదేమోనని తెలిపింది నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. భావోద్వేగం చెందుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

'సుశాంత్​ చివరి సినిమా చూడటం నా వల్ల కాదేమో'
సుశాంత్ జాక్వెలిన్

By

Published : Jun 28, 2020, 7:52 AM IST

Updated : Jun 28, 2020, 11:31 AM IST

బాలీవుడ్​ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ చివరి సినిమా చూడటం తనకు అంత సులభం కాదని నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెప్పింది. అయితే ఈ చిత్రంలో అతడి నటన అద్భుతంగా ఉంటుందని, అది తనకు శాంతిని ఇస్తుందని తెలిపింది. వీరిద్దరూ 'డ్రైవ్​'లో కలిసి నటించారు. సుశాంత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బెచెరా' ప్రమోషన్​లో భాగంగా ఈ విషయాల్ని పంచుకుందీ ముద్దుగుమ్మ.

"సుశాంత్ అకస్మాత్తుగా వెళ్లిపోవడం అందరికీ లోటే. ప్రజల కోసం ఎప్పుడూ ఉండాలని నాకు చెప్పేవాడు. గందరగోళం, ఒత్తిడికి గురైన సమయంలో నాకు సాయం చేసేందుకు అసలు వెనుకాడేవాడు కాదు. అయితే సుశాంత్ 'దిల్​బెచారా' చూడటం నాకు అంత సులభం కాకపోవచ్చు" -జాక్వెలిన్ ఫెర్నాండెజ్, బాలీవుడ్​ నటి

​దీనితోపాటే ఆ చిత్ర దర్శకుడు, హీరోయిన్​ గురించి మాట్లాడుతూ.. "సుశాంత్​తో మీరు ఎంత సన్నిహితంగా ఉండేవారు నాకు తెలుసు. డైరెక్టర్ ముఖేశ్ చబ్రా మీరు ధైర్యంగా ఉండండి. సంజనా సంఘీ.. ఆల్​ ద బెస్ట్. తొలి సినిమాకే మంచి నటుడితో తెరను పంచుకునే అదృష్టం దక్కించుకున్నావు. నీ నటనకు సుశాంత్ గర్వపడతాడని నా నమ్మకం" -జాక్వెలిన్ ఫెర్నాండెజ్, బాలీవుడ్ నటి

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 'దిల్​ బెచారా' సినిమాను, జులై 24న హాట్​స్టార్​లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తే సుశాంత్​కు నివాళి దక్కినట్లు అవుతుందని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 28, 2020, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details