తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అలనాటి అందాల తార కుంకుమ్‌ కన్నుమూత

బాలీవుడ్​ సీనియర్​ నటి కుంకుమ్​ అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 'మిస్టర్​ ఎక్స్​ ఇన్​ బాంబే', 'మథర్​ ఇండియా' వంటి హిట్​ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Yesteryear actor Kumkum dies at 86
కుమ్​కుమ్​

By

Published : Jul 28, 2020, 4:39 PM IST

Updated : Jul 28, 2020, 7:41 PM IST

అలనాటి బాలీవుడ్‌ నటి కుంకుమ్(86) జులై 28(మంగళవారం)న తుదిశ్వాస విడిచారు. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతూ బాంద్రాలోని తన నివాసంలో మరణించారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

కుమ్​కుమ్​

ఈమె అసలు పేరు జైబున్సిసా. బిహార్‌లోని షేక్పురా జిల్లా హుస్సేనాబాద్‌లో ఏప్రిల్ 22, 1934న జన్మించారు. 1954లో 'ఆర్ పార్ట' చిత్రంలోని 'కబీ ఆర్ కబీ పార్ లాగా తీరే నాజర్' పాటతో నర్తకిగా బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. మొత్తంగా కెరీర్​లో పలు భాషల్లో వందకుపైగా చిత్రాల్లో నటించారు. వాటిలో 'మిస్టర్ ఎక్స్ ఇన్ బొంబాయి' (1964), 'మదర్ ఇండియా' (1957), 'సన్ ఆఫ్ ఇండియా' (1962), 'కోహినూర్' (1960), 'ఉజాలా', 'నయా దౌర్', 'శ్రీమాన్ ఫుంటూష్', 'ఏక్ సపెరా ఏక్ లుటెరా' చిత్రాలతో ప్రసిద్ది చెందారు.

ఇది చూడండి లెఫ్ట్​నెంట్​ అధికారి బయోపిక్​లో దుల్కర్​ సల్మాన్​

Last Updated : Jul 28, 2020, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details