తెలంగాణ

telangana

By

Published : Jun 17, 2020, 5:17 PM IST

ETV Bharat / sitara

'అవకాశాల​ కోసం వాళ్లు చెప్పింది చేయాలి'

హీరో సుశాంత్ సింగ్ మృతిపై స్పందించిన నటి శ్రద్ధాదాస్.. సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్​లో​ నిలదొక్కుకోవడం సులభం కాదని తెలిపింది. అవకాశాల కోసం పీఆర్ మేనేజర్లు చెప్పింది చేయాల్సి ఉంటుందని ఇన్​స్టోలో పోస్ట్ చేసింది.

We have to do as PRO says for the Movie Chance in Bollywood: Shraddha Das
'బాలీవుడ్​లో సినిమా ఛాన్స్​ కోసం వాళ్లు చెప్పింది చేయాలి'

సినిమాల్లో అవకాశాలు దక్కాలంటే కష్టాలు ఎదుర్కోవాలని, సపోర్ట్ లేకుండా బాలీవుడ్‌లో పైకి రావడం అంత సులభం కాదని నటి శ్రద్ధాదాస్ చెప్పింది‌. ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ మృతిపై స్పందిస్తూ, పలు విషయాల్ని ఇన్‌స్టా‌లో పంచుకుంది.

"బాలీవుడ్‌ సినిమాల్లో నటించాలంటే అంత సులభం కాదు. వారసత్వ అండదండలు లేనివాళ్లయితే చాలా కష్టాలు ఎదుర్కొనవలసిందే. ముఖ్యంగా బాలీవుడ్​లో రాణించాలంటే ముంబయిలోని బాంద్రా, జుహూలో జరిగే పార్టీలకు, ఖరీదైన పబ్బులకు వెళ్లాలి. అక్కడున్న వారిని మనం స్నేహితులుగా చేసుకోవాలి. అంటే దేవుడి కంటే ముందు పూజారిని కలుసుకున్నట్లు. ఇలాంటి ఎన్నో మానసిక ఒత్తిడులను భరించాలి. ఇండస్ట్రీలోని పీఆర్‌ మేనేజర్లు ఇలాంటి పార్టీలకు వెళ్లాల్సిందే అంటూ ఉసిగొల్పుతారు. వారికి ఎంతో కొంత ముట్టజెప్పినా ఎలాంటి ఫలితం ఉండదు. ఖరీదైన జీవితాన్ని అనుభవించాలి. సినీ పెద్దల దృష్టిలో పడేందుకు నానా తిప్పలు పడాలి. ఇవన్నీ భరించాలంటే ఎంత డబ్బయినా సరిపోదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు, సినీ కుటుంబ నేపథ్యం లేకుండా వచ్చిన వాళ్లు చాలా నలిగిపోతారు. డ్రస్‌లు, కార్లు, పీఆర్‌ మేనేజర్లు, సెలూన్‌ స్పా లాంటి ఎన్నో వ్యవహారాలను పాటించాలి. ఇది చాలా ఖరీదైన వ్యవహారం. ఓ దశలో అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామా? అనిపిస్తోంది"

-శ్రద్ధాదాస్​, కథానాయిక

శ్రద్ధాదాస్

ఈమె తెలుగు, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్​లో 'నిరీక్షణ'లో హీరోయిన్​గా నటిస్తోంది. గతేడాది కార్తికేయ నటించిన 'హిప్పీ'లో అతిథి పాత్రలో కనిపించింది.

ఇదీ చూడండి... సుశాంత్ సూసైడ్: సల్మాన్, కరణ్, భన్సాలీపై కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details