మంచు విష్ణు సతీమణి వెరోనికా మొదటిసారి మోహన్‌బాబు స్టైలిష్ట్‌గా వ్యవహరించనున్నారు. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాకు ఆమె స్టైలిష్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసంలో ప్రారంభమైంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సమర్పణలో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు స్క్రీన్ ప్లే అందించారు.
మోహన్‌బాబు స్టైలిష్ట్‌గా విష్ణు సతీమణి - Mohan Babu latest news
మంచు విష్ణు సతీమణి వెరోనికా మొదటిసారి మోహన్‌బాబుకు స్టైలిష్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.
మోహన్‌బాబు స్టైలిష్ట్‌గా ఆయన కోడలు
'సన్ ఆఫ్ ఇండియా' ప్రారంభమైన సందర్భంగా మోహన్‌బాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన కుమార్తె లక్ష్మీ ఓ ట్వీట్ పెట్టారు. "కంగ్రాట్స్ నాన్న! దీని కోసం నేను ఎంతో కాలంగా వేచిచూస్తున్నా. మీ అద్భుత నటనను వెండితెరపై చూడడానికి ఆసక్తిగా ఉన్నా. ఆల్ ది బెస్ట్" అని ఆమె పేర్కొన్నారు.