తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కమల్ 'విక్రమ్' షూటింగ్ షురూ.. 'సార్పట్ట' తెలుగు ట్రైలర్ - కమల్ హాసన్ విజయ్ సేతుపతి

కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం విక్రమ్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది. అలాగే ఆర్య నటించిన సార్పట్ట తెలుగు ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది.

vikram
విక్రమ్

By

Published : Jul 16, 2021, 3:48 PM IST

కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా లోకేశ్​ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి 'విక్రమ్‌' అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఓ విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. తాజాగా ఈ సినిమా షూటింగ్​ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దీనికి సంబంధించిన అప్​డేట్​ను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది చిత్రబృందం. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌తో పాటు విజయ్ సేతుపతి ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్​లుక్​ను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

విక్రమ్ షూటింగ్ షురూ

'కబాలి', 'కాలా' చిత్రాలతో తెలుగులోనూ విశేష ఆదరణ పొందారు తమిళ దర్శకుడు పా రంజిత్‌. ఇప్పుడు ఆయన నుంచి 'సార్పట్ట' అనే చిత్రం రాబోతుంది. ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. జులై 22 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తెలుగు ట్రైలర్​ను ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి విడుదల చేశారు.

ఇవీ చూడండి: Rape case: ప్రముఖ నిర్మాతపై రేప్ కేసు

ABOUT THE AUTHOR

...view details