తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాస్... ఇది మన పని కాదు: రౌడీ హీరో - reply

కన్నడ హీరో రక్షిత్​తో రష్మిక బ్రేకప్​ గురించి రిపోర్టర్​ అడిగిన ప్రశ్నకు విజయ్​ దేవరకొండ స్పందించాడు. ఇది మన పని కాదంటూ ఘాటుగా బదులిచ్చాడు.

విజయ్ దేవరకొండ

By

Published : Jul 16, 2019, 1:24 PM IST

Updated : Jul 16, 2019, 3:31 PM IST

విజయ్​ దేవరకొండ, రష్మిక మందణ్న రెండోసారి కలిసి నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది ఈ జోడీ. కన్నడ నటుడు రక్షిత్​తో బ్రేక్​ప్ గురించి రష్మికను ఓ రిపోర్టర్ అడగగా... విజయ్ దేవరకొండ స్పందించాడు. ఇది మన పని కాదంటూ బదులిచ్చాడు.

"నీ ప్రశ్నేంటో నాకర్థం కాలేదు. ఒకరి వ్యక్తిగత జీవితాల్లో జరిగిన విషయాలు పట్టించుకోవడం మన పని కాదు. అలాగే ఎవరి పని కాదు". -విజయ్​ దేవర కొండ

వెంటనే రిపోర్టర్​ ప్రశ్నకు సానుకూలంగా బదులిచ్చింది రష్మిక. "ఇది ఎప్పటినుంచో ఎదురవుతోన్న ప్రశ్న. అర్థం చేసుకోవడం కొంచెం కష్టం" అంటూ సమాధానపరిచింది.

"కిరిక్ పార్టీ" సినిమా చిత్రీకరణ సమయంలో కన్నడ హీరో రక్షిత్​తో ప్రేమలో పడింది రష్మిక. అనంతరం 2017లో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే గతేడాది వ్యక్తిగత కారణాలతో విడిపోయారు.

ఇది చదవండి: ఖర్చు సూర్యది... సందేశం జ్యోతికది

Last Updated : Jul 16, 2019, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details