తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గల్లీబాయ్ తెలుగు రీమేక్​లో విజయ్ దేవరకొండ.? - విజయ్ దేవరకొండ

బాలీవుడ్​ సూపర్​హిట్​ సినిమా 'గల్లీబాయ్​'  తెలుగు రీమేక్​లో హీరో విజయ్ దేవరకొండ నటించనున్నాడని సమాచారం.

గల్లీబాయ్  తెలుగు రీమేక్​లో విజయ్..?

By

Published : Apr 13, 2019, 12:46 PM IST

రణ్​వీర్ సింగ్ ర్యాపర్​గా ఆకట్టుకున్న బాలీవుడ్​ సినిమా 'గల్లీబాయ్'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. దీన్ని తెలుగులో రీమేక్​ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తాడని మొదట్లో వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదని తేలింది. ఇప్పుడు ఈ జాబితాలోకి హీరో విజయ్ దేవరకొండ వచ్చాడు. యువతలో మంచి ఫాలోయింగ్​ ఉన్న విజయ్ అయితేనే ఆ పాత్రకు సరిపోతాడని సంబంధిత నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు విజయ్​ దేవరకొండ. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక మందాన హీరోయిన్​గా కనిపించనుంది. కాలేజ్ నేపథ్యంలో కథ మొత్తం సాగనుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 6న విడుదల కానుంది.

ఇది చదవండి:'రష్మిక కళ్ల గురించి విజయ్ దేవరకొండ పాట'

ABOUT THE AUTHOR

...view details