గీతగోవిందంతో హిట్ జోడిగా పేరు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ-రష్మిక మందన. వీరిద్దరూ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటిస్తున్నారు. అందులో నుంచి 'నీ నీలి కళ్లలోనా ఆకాశమే' అనే పాట విడుదలై సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది.
"విజయ్...రష్మిక..ఓ మెలోడీ పాట" - విజయ్ దేవరకొండ
'డియర్ కామ్రేడ్' సినిమాలోని 'నీ నీలి కళ్లలోనా ఆకాశమే...' పాట ఇప్పటికే అందర్ని ఆకట్టుకుంటోంది. దానికి ఇంకా క్రేజ్ తెచ్చేందుకు విజయ్ దేవరకొండ ఓ వీడియోనూ ట్విట్టర్లో పంచుకున్నాడు.

"విజయ్...రష్మిక..ఓ మెలోడీ పాట"
చెరువు గట్టుపైన, ఓ చల్లని సాయంత్రం వేళ వీరిద్దరు కలిసి ఈ పాటను వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ద్వారా విజయ్ పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.