తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విక్కీ-కత్రినా పెళ్లి.. వాళ్లకు మాత్రం 'నో' ఆహ్వానం! - vicky kaushal harleen sethi love story

విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ పెళ్లికి కొందరు సెలబ్రిటీలను కావాలనే పిలవటంలేదట. ఇంతకీ ఆ స్టార్స్ ఎవరు? వారితో విక్కీ-కత్రినాకి రిలేషన్​ ఏంటి?

Vicky-Katrina wedding
విక్కీ కౌశల్ కత్రినా కైఫ్

By

Published : Dec 5, 2021, 8:23 PM IST

బాలీవుడ్​ స్టార్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్.. త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. డిసెంబరు 9న రాజస్థాన్​లోని సిక్స్​సెన్సెస్​ ఫోర్ట్​లో ఈ వేడుక జరగనుంది. అయితే చాలామంది బాలీవుడ్​ సెలబ్రిటీలు, క్రికెటర్లకు ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం అందింది. అలానే కొందరికి కావాలనే ఇన్విటేషన్​ పంపలేదట. వారిలో విక్కీ-కత్రినా మాజీ లవర్స్​ ఉన్నట్లు తెలుస్తోంది.

రణ్​బీర్ కపూర్​తో కత్రినా కైఫ్

స్టార్ హీరోలు సల్మాన్​ఖాన్, రణ్​బీర్​ కపూర్​లకు పెళ్లి ఆహ్వానం పంపలేదట. అలానే విక్కీ కౌశల్ మాజీ ప్రేయసి హర్లీన్ సేతిని వివాహానికి పిలవలేదు! విక్కీ-హర్లీన్.. గతంలో దాదాపు రెండేళ్లపాటు డేటింగ్ చేశారు. పలు కారణాల వల్ల ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు.

విక్కీ కౌశల్-హర్లీన్

డిసెంబరు 7-9 తేదీల మధ్య విక్కీ కౌశల్-కత్రినా పెళ్లి వేడుక జరగనుంది! ఈ ఈవెంట్​కు దాదాపు 120 సభ్యులు మాత్రమే హాజరు కానున్నారట.

ఇది చదవండి:Vicky-katrina wedding: విక్కీ-కత్రినా పెళ్లి.. అబ్బో ఎన్ని విశేషాలో?

ABOUT THE AUTHOR

...view details