తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Actor died: ప్రముఖ హిందీ నటుడు కన్నుమూత - యూసఫ్ హుసేన్ న్యూస్

పలు సినిమాలు, టీవీ షోల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న యూసఫ్ హుసేన్(yusuf hussain actor) కన్నుమూశారు. పలువురు నటీనటులు, సోషల్ మీడియాలో ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

Veteran actor Yusuf Husain
యూసఫ్ హుసేన్

By

Published : Oct 30, 2021, 10:34 AM IST

Updated : Oct 30, 2021, 11:15 AM IST

కన్నడ నటుడు పునీత్ రాజ్​కుమార్(puneeth rajkumar news) హఠాన్మరణంతో అభిమానులు శోకసంద్రంలో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే​ మరో నటుడు మరణించారు. బాలీవుడ్​లో 'వివాహ్', 'ధూమ్ 2', 'దిల్​ చహ్​తా హై' తదితర సినిమాల్లో నటించిన యూసఫ్ హుసేన్(73)(yusuf hussain actor).. కొవిడ్ సమస్యలతో బాధపడుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.

యూసఫ్​ మృతి చెందిన విషయాన్న ఆయన అల్లుడు, 'స్కామ్ 1992'(scam 1992 web series) డైరెక్టర్​ హన్సల్ మెహతా ట్వీట్ చేశారు. తాను ఇప్పుడు అనాథగా మారానని రాసుకొచ్చారు.

యూసఫ్​ సినిమాలతోపాటు టీవీ సీరియళ్లలోనూ నటించారు. రాయిస్, రాజ్, హజరోన్ కవైషేన్ ఐసీ, షాహిద్, ఓ మై గాడ్, క్రిష్ 3, దబంగ్ 3, ద తాష్కెంట్ ఫిల్మ్, జలేజీ లాంటి సినిమాల్లో పలు పాత్రలతో అలరించారు. ముల్లా నసీరుద్దీన్, కుమ్​కుమ్: ఏక్ ప్యారా సా బంధన్, ష్.. కోయి హై, తుమ్ బిన్ జావూన్ కహాన్ తదితర టీవీ షోల్లో కనిపించి ఆకట్టుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 30, 2021, 11:15 AM IST

ABOUT THE AUTHOR

...view details