తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అనాథ పిల్లల కోసం వచ్చిన 'వెంకీమామ' - వెంకటేశ్ అనాథ పిల్లలు

అనాథ పిల్లల కోసం 'వెంకీమామ' ప్రత్యేక షో ఏర్పాటు చేశాడు హీరో వెంకటేశ్. క్రిస్మస్ సందర్భంగా వారికి బహుమతులు ఇచ్చాడు.

అనాథ పిల్లల కోసం వచ్చిన 'వెంకీమామ'
హీరో వెంకటేశ్

By

Published : Dec 24, 2019, 2:07 PM IST

విక్టరీ వెంకటేశ్.. అనాథ పిల్లల కోసం 'వెంకీ మామ' ప్రత్యేక స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశాడు. వారితో కలిసి సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి వెంకీ తీసుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిన్నారులతో చాలా సంతోషంగా వెంకీ కనిపించాడు. క్రిస్మస్‌ సందర్భంగా పిల్లలకు కానుకలూ ఇచ్చాడు.

అనాథ పిల్లల కోసం వచ్చిన 'వెంకీమామ'

ఈనెల 13న వచ్చిన 'వెంకీ మామ' పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం సహా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ ఏడాది 'ఎఫ్‌ 2'తో విజయం అందుకున్న వెంకటేశ్, 'మజలీ'తో ఆకట్టుకున్న నాగచైతన్య కెరీర్‌లో ఇది మరో హిట్‌గా నిలిచింది. 'వెంకీమామ'కు బాబీ దర్శకుడు. రాశీ ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లు.

అనాథ పిల్లల కోసం వచ్చిన 'వెంకీమామ'
అనాథ పిల్లల కోసం వచ్చిన 'వెంకీమామ'

ఇది చదవండి: కలెక్షన్స్: బాక్సాఫీస్​ వద్ద 'వెంకీమామ' జోష్​

ABOUT THE AUTHOR

...view details