టాలీవుడ్ హీరోలు వెంకటేశ్-నాగచైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ 'వెంకీమామ'. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమా టైటిల్ గీతాన్ని గురువారం.. సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్రబృందం. 'మామ.. మామ.. మామ.. నే పలికిన తొలి పదమా' అంటూ సాగుతున్న లిరిక్స్ అలరిస్తున్నాయి.
అమ్మయినా.. నాన్నయినా.. నువ్వేలే 'వెంకీమామ' - cinema latest news
'వెంకీమామ' చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను గురువారం విడుదల చేసింది చిత్రబృందం. క్లాస్, మాస్ బీట్స్ కలిసున్న ఈ గీతం అభిమానుల్ని అలరిస్తోంది.
'వెంకీమామ' టైటిల్ సాంగ్
వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతన్యకు జోడీగా రాశీఖన్నా కనిపించనున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. కె.ఎస్. రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: మాస్ బీట్.. పోలీస్ గెటప్.. సూపర్‌స్టార్ అదుర్స్