ఫ్యామిలీ చిత్రాలతో తెరపై సందడి చేసే వెంకటేశ్...బయట కూడా అంతే సరదాగా ఉంటారు. షూటింగ్ లేని సమయాల్లో ఎక్కువగా కుటుంబంతోనే గడుపుతుంటారు. వెంకీ తన కుటుంబ సభ్యులతో ఎంత సందడిగా గడుపుతుంటారో చెబుతూ సమంత ఓ ఫొటో షేర్ చేసింది.
వెంకీ మామ... కుటుంబంపై అమిత ప్రేమ - టాలీవుడ్
కుటుంబ కథా చిత్రాల్లో చక్కగా ఒదిగిపోవడంలో హీరో వెంకటేష్‌ను మించిన వారు ఉండరు. అందుకే ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. తాజాగా నిజజీవితంలోనూ కుటుంబంతో ఆయన చేసిన సందడిని అభిమానులతో పంచుకున్నారు సమంత.
వెంకీ మామ...కుటుంబంపై ప్రేమ
వెంకటేశ్ శ్రీమతి, ముగ్గురు కుమార్తెలు, అన్న సురేష్‌బాబు కూతురు, మేనల్లుడు నాగచైతన్య భార్య సమంతతోనూ కలిసి ఫోజులిచ్చారు. ఇటీవలే వెంకీ కుమార్తె పెళ్లి వేడుక జరిగింది. ఆ సందర్భంగానే ఈ ఫొటో దిగారు. ఈ చిత్రాన్ని చూసిన నెటిజన్లు సంక్రాంతి సినిమా గుర్తుకొస్తోదంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Apr 24, 2019, 10:04 AM IST