తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Cinema news: 'వరుడు కావలెను', 'రొమాంటిక్' మేకింగ్ వీడియోలు - maheshbabu sarkaru vaari paata movie

సినీ అప్డేట్స్(cinema news) వచ్చేశాయి. శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యే వరుడు కావలెను(varudu kaavalenu release date), రొమాంటిక్(romantic movie review) చిత్ర మేకింగ్ వీడియోలు అంచనాల్ని పెంచుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసేయండి.

.
.

By

Published : Oct 28, 2021, 9:07 AM IST

"ఇది ఓ అమ్మ కథ. ఓ అమ్మాయి కథ. ప్రతి అమ్మాయి కావాలనుకునే వరుడి కథ." అని 'వరుడు కావలెను'(varudu kaavalenu review) టీమ్ అంటోంది. శుక్రవారం సినిమా రిలీజ్​ కానున్న సందర్భంగా మూవీ మేకింగ్ వీడియో విడుదల చేసింది. హీరోహీరోయిన్​తో పాటు దర్శకురాలు, డైలాగ్ రైటర్, సంగీత దర్శకుడు తదితరులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఇందులో నాగశౌర్య-రీతూవర్మ(naga shaurya and ritu varma movie) జంటగా నటించారు. లక్ష్మీ సౌజన్య డైరెక్టర్. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు.

'రొమాంటిక్' మూవీ(romantic movie cast) మేకింగ్ వీడియో కూడా అలరిస్తోంది. అలానే సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. రొమాన్స్​తోపాటు యాక్షన్, డైలాగ్స్.. ఇలా అన్నీ అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఆకాశ్ పూరీ, కేతిక శర్మ(ketika sharma upcoming movie) హీరోహీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించారు. అనిల్ పాదురి దర్శకుడు. పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్​ప్లే, మాటలు అందిచడమే కాకుండా ఛార్మితో కలిసి నిర్మించారు.

'సర్కారు వారి పాట'(sarkaru vaari paata release date) సెట్​లోని సూపర్​స్టార్ మహేశ్(mahesh babu new movie)​ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్​గా మారింది. ఇందులో స్మార్ట్​, స్టైలిష్​గా కనిపిస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు మహేశ్. కీర్తి సురేశ్​(keerthy suresh movies) ఇందులో హీరోయిన్​గా నటిస్తోంది. పరశురామ్ దర్శకుడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి రానుంది.

సెట్​లో మహేశ్​బాబు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details