తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శ్రీదేవి కోసం.. వర్మ​ శ్రీకృష్ణుడు అయ్యాడు..! - sri devi

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు వినూత్నంగా తెలిపాడు విలక్షణ దర్శకుడు రామ్​గోపాల్ వర్మ. తనను చిలిపి కృష్ణుడిగా చూపించుకుంటూ.. అతిలోకసుందరి శ్రీదేవిని గోపికగా మార్చి సరదా సంభాషణతో ఇన్​ స్టాలో వీడియో షేర్ చేశాడు.

రామ్​గోపాల్ వర్మ

By

Published : Aug 23, 2019, 8:15 PM IST

Updated : Sep 28, 2019, 12:52 AM IST

శ్రీదేవి అంటే సగటు ప్రేక్షకుడి దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అమితమైన అభిమానం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో రామ్​గోపాల్​ వర్మ ముందు వరుసలో ఉంటాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆమెపై అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శించాడు.

తనను శ్రీకృష్ణుడిగా చూపించుకుంటూ..శ్రీదేవిని గోపికగా మార్చి ఓ సరదా వీడియోను రూపొందించి ఇన్​ స్టాలో పోస్ట్ చేశాడు వర్మ.

వీడియోలో శ్రీదేవి "మానవా..మానవా" అని పిలవగా.. "ఉన్నానండి.. ఇక్కడే ఉన్నాను" అని వర్మ చెప్పడం. "దమ్ముకొట్టడం.. రమ్ముకొట్టడం.. సిగ్గులేదు" అని శ్రీదేవి వర్మను తిడుతుండగా.. "అరవడం ఆపకపోతే ఇరగ్గొడతాను" అంటూ గట్టిగా వార్నింగ్‌ ఇవ్వడం నవ్వులు పూయిస్తున్నాయి. చివర్లో శ్రీదేవి "ఐ లైక్‌ యూ".. అని చెప్పగా.. ‘‘సూపర్బ్‌.. థ్యాంక్స్‌ అండీ" అని వర్మ చెప్పడం హైలైట్‌గా నిలిచింది.

ఇలా సరదాగా సాగిన వీడియో ఆకర్షిస్తోంది. శ్రీదేవిపై అభిమానాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చూపించడం ఆసక్తికరంగా ఉందంటూ నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

ఇది చదవండి: 'నన్ను ట్రోల్​ చేయండి.. నాపై మీమ్స్ వేయండి'

Last Updated : Sep 28, 2019, 12:52 AM IST

ABOUT THE AUTHOR

...view details