మెట్‌గాలా ఈవెంట్‌లో ప్రియాంక హెయిర్ స్టయిల్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. వీరికి టాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తోడయ్యారు. ఆమె పిచ్చుక గూడు లాంటి హెయిర్ స్టయిల్.... వీరప్పన్ మీసాన్ని పోలి ఉందని ట్వీట్ చేశారు. వీరప్పన్ మీసం కింద ప్రియాంక జుట్టును సెట్ చేసి ఆ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు.
వీరప్పన్, ప్రియాంకతో వర్మ నయా "చిత్రం" - మెట్‌గాలా ప్రియాంక
న్యూయర్క్‌లో ఇటీవల జరిగిన మెట్‌గాలా ఈవెంట్‌లో బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనాస్‌తో కలిసి సందడి చేసింది. ఆ వేడుకలో ఆమె హెయిర్ స్టయిల్ ప్రత్యేకాకర్షణగా నిలిచింది. అయితే దీనిపై సంచలన దర్శకుడు వర్మ కామెంట్ చేశారు.
ప్రియాంక హెయిర్ స్టయిల్‌పై వర్మ కామెంట్
" ఎంతో పాపులర్ అయిన ఆ మీసం కింద ఈ హెయిర్ స్టయిల్ సరిగ్గా సరిపోయింది. వీరప్పన్ మీసం పోలినట్లు ప్రియాంక హెయిర్‌ను సెట్ చేసిన ఆ హెయిర్ స్టయిలిస్ట్కు వ్యక్తిగతంగా సెల్యూట్ చేస్తున్నాను. ఐ లవ్ ఇట్. ఆ హెయిర్ స్టయిల్ నాకు ఎందుకు నచ్చిందో తర్వాత చెప్తా "
-- రామ్ గోపాల్ వర్మ, దర్శకుడు