తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వైష్ణవ్, రకుల్ చిత్రం షూటింగ్ పూర్తి! - వైష్ణవ్ తేజ్ క్రిష్ చిత్రం షూటింగ్ పూర్తి

వైష్ణవ్ తేజ్, రకుల్​ప్రీత్ సింగ్ ప్రధానపాత్రల్లో క్రిష్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్​ పూర్తయినట్లు వెల్లడించింది చిత్రబృందం.

Vaishnav Tej, Rakul Preet new movie Shooting completed
వైష్ణవ్, రకుల్ చిత్రం షూటింగ్ పూర్తి!

By

Published : Oct 24, 2020, 1:15 PM IST

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్​ప్రీత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరింది. 40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న క్రిష్.. 35 రోజుల్లోనే సినిమా పూర్తి చేయడం విశేషం. వికారాబాద్ అటవీ ప్రాంతంలో ఒకే షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేశారు. 'కొండపొలం' నవల ఆధారంగా క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తున్న క్రిష్.. కరోనా నేపథ్యంలో ఆ సినిమాకు విరామమిచ్చారు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పకడ్బందీగా, వైష్ణవ్, రకుల్​ల మరో సినిమా పూర్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details