మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ 'రంగస్థలం' ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే కాకుండా ఓవర్సీస్లోనూ దుమ్మురేపింది. నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది. అయితే మరోసారి ఇంతకు మించిన కథతో, ఇదే హీరోతో సినిమా చేయనున్నాడట దర్శకుడు. ఇదే విషయమై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఈసారి 'రంగస్థలం'కు మించిన కథతో! - రామ్‌చరణ్, సుకుమార్
టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్... మెగాహీరో రామ్‌చరణ్‌తో మరోసారి కలిసి పనిచేయనున్నాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.
ఈసారి 'రంగస్థలం'కు మించిన కథతో!
ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో సినిమా చేస్తున్నాడు సుకుమార్. విజయ్ సేతుపతి విలన్‌గా, రష్మిక హీరోయిన్గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే చరణ్-సుక్కుల సినిమా ప్రారంభం కావొచ్చు.
ఇదీ చదవండి: అందుకే ఆ సన్నివేశాల్లో నటించా: రాశీఖన్నా
Last Updated : Feb 29, 2020, 8:52 AM IST