ఆత్మహత్య చేసుకున్న టీవీ నటుడు సమీర్ - టీవీ నటుడు సమీర్ శర్మ వార్తలు
12:55 August 06
నటుడు సమీర్ శర్మ సూసైడ్
టీవీ నటుడు, మోడల్ సమీర్ శర్మ(44).. ముంబయిలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతడు హే రిస్తా హై ప్యార్ కే, జ్యోతీ, కహానీ ఘర్ ఘర్ కీ, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ధారావాహికలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
మలద్ పశ్చిమలోని ఓ భవంతిలో ఫిబ్రవరి నుంచి అద్దెకు ఉంటున్నాడు సమీర్. బుధవారం రాత్రి విధుల్లో భాగంగా ఉన్న వాచ్మన్.. ఇతడు ఉరి వేసుకున్నట్లు గుర్తించి, మిగిలిన సొసైటీ సభ్యులకు సమాచారమిచ్చాడు. అతడు శరీరాన్ని పరిశీలించిన పోలీసులు.. రెండు రోజుల క్రితమే ఇతడు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు.