తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వైరల్: రణ్​బీర్​-ఆలియా పెళ్లి ఫొటో..! - bollywood

'బ్రహ్మాస్త్ర' జోడి రణ్​బీర్-ఆలియా పెళ్లి ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అయితే అది నిజమైంది కాదు. ఓ అభిమాని మార్ఫింగ్ చేసిన చిత్రానికి నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఆలియా భట్

By

Published : Sep 5, 2019, 4:55 PM IST

Updated : Sep 29, 2019, 1:27 PM IST

బాలీవుడ్ జోడి రణ్​బీర్ కపూర్, ఆలియా భట్​ మధ్య ప్రేమాయణం గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రణ్​బీర్-ఆలియా పెళ్లి దుస్తుల్లో ఉన్న ఒక ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

ఇప్పటికే ఆలియా తండ్రిని కలిసిన రణ్​బీర్ పెళ్లి విషయమై ప్రస్తావించినట్లు సమాచారం. కానీ రెండు కుటుంబాలు దీనిపై ఇప్పటి వరకు అధికారిక వివరణ ఇవ్వలేదు. అయినా వీరిద్దరూ 2020లో పెళ్లి పీటలెక్కనున్నట్లు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి.ఇలాంటి సమయంలోఓ అభిమాని సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరి ఫొటోను మార్ఫింగ్ చేసి షేర్ చేశాడు. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఈ స్టిల్​ నెట్టింట హల్​చల్ చేస్తోంది.

రణ్​బీర్-ఆలియా

ప్రస్తుతం వీరిద్దరూ 'బ్రహ్ర్మాస్త్ర' చిత్రంలో బిజీగా ఉన్నారు. తొలిసారి ఈ జోడి తెరపై సందడి చేయనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. 2020లో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇవీ చూడండి.. తెలుగులో హృతిక్​-వాణీ రొమాంటిక్​ సాంగ్​

Last Updated : Sep 29, 2019, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details