మాటల మాంత్రికుడు త్రివిక్రమ్-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'అల వైకుంఠపురములో'. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా ప్రచారంలో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు, ఆసక్తికర సమాధానం ఇచ్చాడీ డైరెక్టర్. తన సినిమాలు.. టీవీలో అసలు చూడనని, వస్తే వెంటనే కట్టేస్తానని అన్నాడు. అందుకు గల కారణాన్ని వివరించాడు.
"నేను నా సినిమాలు టీవీలో చూడను. ఒకవేళ మా ఆవిడ చూస్తే, అప్పుడు టీవీ కట్టేస్తాను. ఎందుకంటే వాటిలో నాకు తప్పులు కనిపిస్తాయి" -త్రివిక్రమ్, దర్శకుడు