తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జీవితం గురించి త్రివిక్రమ్ 20 డైలాగ్​లు

మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా.. జీవితం గురించి ఎంతో అర్థవంతగా చెప్పే ఈ 20 డైలాగ్​లు మరోసారి మీకోసం.

జీవితం గురించి చెప్పే త్రివిక్రమ్ 20 డైలాగ్​లు

By

Published : Nov 7, 2019, 7:32 AM IST

Updated : Nov 7, 2019, 9:15 AM IST

అతడు... తన మాటలతో ప్రేక్షకులని మాయ చేసే మాటల మాంత్రికుడు. ప్రాసల 'ఖలేజా'తో ప్రేక్షకులను ఆకట్టుకునే మాటల రచయిత, దర్శకుడు. ఆయన మాటలకు అబ్బురపడిన ప్రేక్షకులు 'నువ్వు నాకు నచ్చావ్‌' అన్నారు. 'జై చిరంజీవా' అంటూ ఆశీర్వదించారు. ఆ మధ్య 'అరవింద సమేత'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని రూపొందిస్తున్న త్రివిక్రమ్‌ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా త్రివిక్రమ్​ సినిమాల్లోని ఫేమస్​ డైలాగ్​లు మీకోసం.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్​ పుట్టినరోజు ప్రత్యేకం
  • మనం గెలిచినప్పుడు చప్పుట్లు కొట్టే వాళ్లు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టే వాళ్లు నలుగురు లేనప్పుడు.. ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా తేడా ఏముండదు- వెంకటేశ్
  • వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయినట్టు.. ఫెయిల్​ అయిన ప్రేమికులు అందరూ ఫ్రెండ్స్​ అయిపోలేరు-వేణు
  • మనం తప్పు చేస్తున్నామో రైట్​ చేస్తున్నామో మనకు తెలుస్తుంది.. మనకు మాత్రమే తెలుస్తుంది-తరుణ్
  • నిజం చెప్పకపోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం-మహేశ్​బాబు
  • మనం ఇష్టంగా అనుకున్నదే అదృష్టం.. బలంగా కోరుకునేది భవిష్యత్తు-అల్లు అర్జున్
  • మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి. సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు-సుహాసిని
  • ఆడపిల్లకు గుణాన్ని మించిన ఆస్తి లేదు- విక్టరీ వెంకటేశ్
  • ఒక మనిషిని ప్రేమిస్తే, వాళ్లు చేసే తప్పుని కూడా మనం క్షమించగలగాలి-తరుణ్
  • అద్భుతం జరిగేటపుడు ఎవరూ గుర్తించరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు -రావు రమేశ్
    మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్
  • ఆడపిల్లలు... ఎంత తొందరగా ప్రేమిస్తారో అంత తేలిగ్గా మర్చిపోతారు-మన్మథుడు సినిమా
  • దెయ్యం కంటే భయం మహా చెడ్డదండి-సునీల్
  • తండ్రికి, భవిష్యత్తుకు భయపడని వాడు.. జీవితంలో పైకి రాలేడు-విజయ్ కుమార్
  • విడిపోయేటపుడే బంధం విలువ.. తెగిపోయేటపుడే దారం విలువ తెలుస్తుంది- రావు రమేశ్
  • బెదిరింపునకు భాష అవసరం లేదు.. అర్థమైపోతుంది-ముఖేశ్ రిషి
  • పనిచేసి జీతం అడగొచ్చు. అప్పిచ్చి వడ్డీ అడగొచ్చు. కాని హెల్ప్ చేసి మాత్రం థాంక్స్​ అడక్కూడదు-వెంకటేశ్
  • బాధలో ఉన్నవాడిని ఎలా ఉన్నావు అని అడగడం అమాయకత్వం. బాగున్నవాడిని ఎలా ఉన్నావు అని అడగడం అనవసరం- చంద్రమోహన్
    పవర్​స్టార్ పవన్​కల్యాణ్​తో దర్శకుడు త్రివిక్రమ్
  • కారణం లేని కోపం, ఇష్టం లేని గౌరవం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం-పవర్​స్టార్ పవన్​కల్యాణ్
  • ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు - అత్తారింటికి దారేది
  • మనసులో ఉన్న మనిషి పక్కన మామూలుగా తిరగడం చాలా కష్టం-వర్ష
  • సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు- చంద్రమోహన్
Last Updated : Nov 7, 2019, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details