దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. విభిన్నమైన, వివాదాస్పద సినిమాలు తీయడంలో ముందుంటాడు. ఓ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగానే, మరొకటి పట్టాలెక్కిస్తాడు. ప్రస్తుతం 'ఎంటర్ ద గర్ల్ డ్రాగన్' అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన కీలక విషయాలను సోమవారం వెల్లడించాడు.
మార్షల్ ఆర్ట్స్‌లో పేరుగాంచిన బ్రూస్‌లీ స్ఫూర్తిగా ఈ సినిమాను తీస్తున్నాడు వర్మ. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ పతాకంపై నిర్మితమవుతోంది. త్వరలో టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ట్వీట్ చేశాడు.