తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తూఫాన్' ఫస్ట్​ లుక్​.. బాక్సర్​గా ఫర్హాన్

బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్​ హీరోగా నటిస్తున్న 'తూఫాన్' ఫస్ట్​లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో బాక్సర్​గా కనిపించనున్నాడీ కథానాయకుడు.

By

Published : Sep 30, 2019, 2:50 PM IST

Updated : Oct 2, 2019, 2:23 PM IST

తూఫాన్

ఫర్హాన్ అక్తర్ హీరోగా వచ్చిన 'భాగ్ మిల్కా భాగ్' సినిమా ఘన విజయం సాధించి, బయోపిక్​లు తీయాలనుకునే వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రాతో మరోసారి కలిసి పనిచేస్తున్నాడీ హీరో. 'తూఫాన్' అనే టైటిల్​ నిర్ణయించారు. ఇందులో బాక్సర్​గా కనిపించనున్నాడు ఫర్హాన్. సోమవారం విడుదల చేసిన ఫస్ట్​లుక్ ఆకట్టుకుంటోంది.​

ఈ పోస్టర్​లో కండలు తిరిగిన దేహంతో ప్రొఫెషనల్​ బాక్సర్​గా కనిపిస్తున్నాడు ఫర్హాన్. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇవీ చూడండి.. 'రొమాంటిక్'​ ఫస్ట్​ లుక్​ అంతే రొమాంటిక్​గా

Last Updated : Oct 2, 2019, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details