'జేమ్స్ బాండ్' చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. ఈ సిరీస్‌లోని 25వ సినిమా 'నో టైమ్ టు డై' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటే గత నాలుగు చిత్రాల్లో బాండ్‌గా డేనియల్ క్రెగ్ నటించి మెప్పించారు. ఇప్పుడు ఆ పాత్రకు గుడ్‌బై చెప్పనున్నారు క్రెగ్. దీంతో తర్వాతి బాండ్‌గా ఎవరు కనిపించనున్నారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
బ్రిటీష్ నటుడు టామ్ హార్డీ తదుపరి బాండ్‌గా నటిస్తారని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం. 'ఇన్సెప్షన్', 'ది డార్క్ నైట్ రైజస్', 'లండన్ రోడ్' సినిమాల్లో ఇతడు నటించారు. తర్వలోనే 'వీనమ్ : లెట్ థేర్ బి కర్నేజ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.