హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరు కథానాయకులు నేలపై స్టంట్స్ చేస్తే, ఈయన మాత్రం అత్యంత ఎత్తైన బూర్జ్ ఖలీఫాపైనా సాహసాలు చేశారు. అంతరిక్షంలోనూ ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లి వచ్చారు.
'మిషన్ ఇంపాజిబుల్' సీక్వెన్స్‌లో వస్తున్న ఎనిమిదో సినిమా కోసం టామ్ అద్భుతమైన ఫీట్ చేశారు. రెండువేల అడుగుల ఎత్తులో ప్రైవేట్ విమానం ఎగురుతుండగా, దాని కాక్‌పిట్‌లో నుంచి బయటకు వచ్చి విమానం రెక్కపై కూర్చున్నారు.