తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​ ఎంట్రీకి సిద్ధమైన తెలుగు తారలు వీరే... - KARTHIKEYA 2

టాలీవుడ్​ స్టార్స్ కొందరు.. త్వరలో బాలీవుడ్​ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. వారినీ తమ నటనా కౌశలంతో మంత్రముగ్ధుల్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ వారెవరు? ఏఏ ప్రాజెక్టులతో అక్కడ అడుగుపెట్టబోతున్నారు?

సినిమా స్టోరీ
బాలీవుడ్​లోక వెళ్తున్న టాలీవుడ్​ స్టార్స్

By

Published : Jun 13, 2020, 1:57 PM IST

Updated : Jun 13, 2020, 6:56 PM IST

దక్షిణాది నటులు బాలీవుడ్​లోకి వెళ్లడం కొత్తేమీ కాదు. అయితే తమ కెరీర్​ ప్రారంభం నుంచి ఎక్కువగా తెలుగులోనే సినిమాలు చేసిన పలువురు ప్రముఖ నటులు.. ఈ ఏడాది లేదంటే వచ్చే సంవత్సరం హిందీ చిత్రసీమలో తమ స్టామినా చూపించబోతున్నారు. వారిలో జూ.ఎన్టీఆర్​ మొదలుకుని సమంత, అడివి శేష్, నిఖిల్, విజయ్ దేవరకొండ ఉన్నారు. వీరందరూ ఏఏ ప్రాజెక్టులతో అక్కడి ప్రేక్షకులను అలరించబోతున్నారు? అవి ఎప్పుడు వచ్చే అవకాశముంది? వంటి విశేషాల సమాహారమే ఈ కథనం.

జూ.ఎన్టీఆర్-ఆర్ఆర్ఆర్

ఇప్పటివరకు కేవలం తెలుగులోనే నటించిన జూ.ఎన్టీఆర్.. 'ఆర్ఆర్ఆర్'తో బాలీవుడ్​లోకి గ్రాండ్​ ఎంట్రీ ఇవ్వనున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న ఈ పాన్​ ఇండియా సినిమాలో రామ్​చరణ్ మరో కథానాయకుడు. ఇప్పటికే 70 శాతానికి పైగా చిత్రీకరణ జరుపుకుంది. వచ్చే జనవరి 8న భారతదేశంలో దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో జూ.ఎన్టీఆర్

సమంత- ద ఫ్యామిలీ మ్యాన్(సీజన్​ 2)

ముద్దుగుమ్మ సమంత.. 'ద ఫ్యామిలీ మ్యాన్' సీజన్​2 వెబ్​ సిరీస్​తో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. గతంలో వచ్చిన 'ఏక్ దివానా థా' అనే బాలీవుడ్​ చిత్రంలో అతిథి పాత్ర పోషించిన ఈమె.. ఇప్పుడు పూర్తిస్థాయి పాత్రలో కనువిందు చేయనుంది. అయితే ఇందులో ఆమె ఉగ్రవాదిగా కనిపించనుందని సమాచారం. ఇది ఎంతవరకూ నిజమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాలి.

ద ఫ్యామిలీ మ్యాన్​ సీజన్​ 2లో సమంత

విజయ్ దేవరకొండ- ఫైటర్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పటివరకు దక్షిణాది భాషల్లో మాత్రమే నటించాడు. ప్రస్తుతం దర్శకుడు పూరీ జగన్నాథ్ తీస్తున్న యాక్షన్ సినిమాతో బాలీవుడ్​లో కాలుమోపనున్నాడు. ఇందులో విజయ్.. బాక్సర్​/ఫైటర్​గా కనిపించనున్నాడు. ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఫైటర్​ సినిమాలో విజయ్ దేవరకొండ-అనన్య పాండే

అడివి శేష్- మేజర్

తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకున్న అడివి శేష్.. ఇప్పటివరకు టాలీవుడ్​ ప్రేక్షకుల్ని మాత్రమే అలరించాడు. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్​ 'మేజర్'లో ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ సంవత్సరం చివర్లో తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది సూపర్​స్టార్ మహేశ్​బాబు కావడం విశేషం.

మేజర్ సినిమాలో అడివి శేష్

నిఖిల్- కార్తికేయ 2

టాలీవుడ్​లో పలు పాన్​ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్న వేళ.. అలాంటి ఓ కథలో నటించేందుకు సిద్ధమయ్యాడు హీరో నిఖిల్. అదే 'కార్తికేయ 2'. తొలిభాగం విశేషంగా ఆకట్టుకున్న నేపథ్యంలో రెండో భాగాన్ని గ్రాండ్​గా​ తీయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగుతోపాటు హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు. తద్వారా బాలీవుడ్​లోకి అరంగేట్రం చేయనున్నాడు నిఖిల్.

కార్తికేయ 2లో హీరో నిఖిల్
Last Updated : Jun 13, 2020, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details