టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. మనకు తెలుసు. కానీ ఈ 'అలీవుడ్' ఏంటనే కదా మీ సందేహం? తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన అలీ.. ఇప్పుడు నిర్మాతగా మారాడు. కొత్తగా ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పాడు. పేరు 'అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్'. ఆసక్తికరంగా ఉంది కదా! అయితే ఇందులో రూపొందే చిత్రాలు ఇంకెంత ఆసక్తిగా ఉంటాయో చూడాలి మరి.
'అలీవుడ్'లో అడుగుపెట్టిన హాస్యనటుడు అలీ - CINEMA VAARTHALU
ప్రముఖ హాస్యనటుడు అలీ.. 'అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్' పేరుతో కొత్తగా నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఇందులో వెబ్‌సిరీస్, టీవీ కార్యక్రమాలు, ధారావాహికలు రూపొందించనున్నారు.
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, సంగీత దర్శకురాలు శ్రీలేఖ తదితరులు హైదరాబాద్‌లో ఇందుకు సంబంధించిన లోగో ఆవిష్కరించారు.
"భవిష్యత్తులో వెబ్ సిరీస్‌లదే హవా. నష్టాల బారిన పడకుండా నిర్మాతలకు డబ్బులు వచ్చే అవకాశం మా అలీవుడ్ సంస్థ కల్పిస్తుంది" అని అన్నాడు అలీ. వెబ్ సిరీస్, టీవీ కార్యక్రమాలు, ధారావాహికలు, వాణిజ్య ప్రకటనలు ఈ నిర్మాణ సంస్థలో రూపొందించనున్నారు. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ వినోదం పంచే ఆలోచనలో ఉన్నారు.