తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తిమ్మరుసు' ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్​కు ఎన్టీఆర్ విజ్ఞప్తి - తిమ్మరుసు ట్రైలర్ జూనియర్ ఎన్టీఆర్

యువనటుడు సత్యదేవ్ హీరోగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తిమ్మరుసు'. జులై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్​ను విడుదల చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

Thimmarusu
తిమ్మరుసు

By

Published : Jul 26, 2021, 5:59 PM IST

నగరంలో ఓ క్యాబ్ డ్రైవర్ హత్య కేసు నేపథ్యంగా యువ కథానాయకుడు సత్యదేవ్ న్యాయవాదిగా నటించిన చిత్రం 'తిమ్మరుసు'. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు నిర్మించారు. ఈ నెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తారక్, సత్యదేవ్, మహేశ్ కోనేరు

ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీ ట్రైలర్​ను విడుదల చేసి దర్శక నిర్మాతలకు అభినందనలు తెలిపారు. 'తిమ్మరుసు' చిత్రాన్ని థియేటర్లలో ఆస్వాదించాలని ప్రేక్షకులకు ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రంలో సత్యదేవ్​కు జోడీగా ప్రియాంక జావల్కర్ నటించగా.. బ్రహ్మాజీ, ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు.

తారక్, సత్యదేవ్
తారక్, సత్యదేవ్, మహేశ్ కోనేరు

ఉత్కంఠగా సాగిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. 'ఎవరైనా కేసు గెలిస్తే బైక్ నుంచి కారు​కు వెళ్తారు.. కానీ రామ్ కారు నుంచి బైక్​కు వచ్చాడు', 'నువు కొడితే సౌండ్ వస్తుందేమో.. ఈ లాయర్ కొడితే లైఫంతా రీసౌండే', 'నువు సగం బలం లాక్కునే వాలివైతే'.. నేను దండేసి దండించే రాముడిలాంటోడ్ని' అంటూ సాగే డైలాగ్స్ అలరిస్తున్నాయి.

ఇవీ చూడండి: 'పుష్ప' ఐటమ్ సాంగ్​ కోసం సన్నీ లియోనీ!

ABOUT THE AUTHOR

...view details