సోషల్‌మీడియా వేదికగా పలువురు నెటిజన్లు తన భర్తపై విపరీతంగా ట్రోలింగ్ చేశారంటూ రాజకీయ నాయకురాలు, నటి ఊర్మిళా మాతోండకర్ అన్నారు. తన భర్తను ఉగ్రవాదిగా పేర్కొంటూ కొంతమంది ఒకానొక సమయంలో పోస్టులు పెట్టారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె తాజాగా తన జీవితానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఎదుర్కొన్న ఇబ్బందులపై స్పందించారు.
'దేనికైనా హద్దు ఉంటుంది'..నెటిజన్లపై ఊర్మిళ ఫైర్
తన భర్తను ఉగ్రవాది అంటూ నెట్టింట పలువురు పోస్టులు పెట్టారని బాలీవుడ్ నటి ఊర్మిళా మాతోండకర్ అన్నారు. కశ్మీర్ వ్యాపారవేత్తను వివాహమాడిన కారణంగా తన కుటుంబంపై ట్రోలింగ్ చేస్తున్నారని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.
"కశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త, మోడల్ మోసిన్ అక్తార్ మీర్‌ను నేను వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కశ్మీర్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న కారణంగా ఎంతో మంది నాతోపాటు నాకుటుంబంపై సోషల్‌మీడియా వేదికగా ట్రోలింగ్ చేశారు. కొంతమంది వ్యక్తులు విక్కీపీడియాలో నా తల్లిదండ్రుల పేర్లను మార్చేశారు. నేనూ, నా భర్త పరస్పరం మా సంప్రదాయాలను, ఆచార అలవాట్లను పాటిస్తాం. గౌరవించుకుంటాం. దానివల్ల కూడా మేము ఆన్‌లైన్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నా భర్తని ఉగ్రవాది అని కామెంట్ చేస్తూ ట్రోల్ చేశారు. తరచూ నాతోపాటు నాకుటుంబంపై ట్రోలింగ్స్ చూడడం దురదృష్టకరం. నా దృష్టిలో దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది" అని ఊర్మిళ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇదీ చూడండి:'జిమ్‌లు లేక 45 అంతస్తులు ఎక్కిదిగేదాన్ని'