తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వచ్చే ఏడాది ఎన్టీఆర్​ ట్రిపుల్ ట్రీట్​..! - entertainment news

'అరవింద సమేత' తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ పూర్తిగా రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసమే సమయం కేటాయించేశాడు. దీని వల్ల గతేడాది ఈ హీరో నుంచి ఒక్క చిత్రమూ రాలేదు. 'ఆర్​ఆర్​ఆర్'​ వచ్చే సంక్రాంతికి వాయిదా వేయడం వల్ల ఇక ఎన్టీఆర్​ను ఇప్పట్లో తెరపై చూడటం కష్టమే. ఈ ఖాళీని భర్తీ చేయడానికి వచ్చే ఏడాది డబుల్​ ట్రీట్​ ఇవ్వనున్నాడట తారక్​.

The south director Vetri Maaran who helmed the blockbuster film Asuran is hoping to cast Jr NTR in his upcoming film.
వచ్చే ఏడాది ఎన్టీఆర్​ డబుల్​ ట్రీట్​..!

By

Published : Feb 12, 2020, 6:42 AM IST

Updated : Mar 1, 2020, 1:17 AM IST

ఏడాదిగా 'ఆర్​ఆర్​ఆర్' చిత్రానికే పరిమితమయ్యాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి వాయిదా వేయడం వల్ల తారక్​ను తెరపై చూడాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. అయితే ఈ రెండేళ్ల గ్యాప్‌ను వచ్చే ఏడాది డబుల్‌ ట్రీట్‌తో తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాడట తారక్‌.

ప్రస్తుతం తారక్.. త్రివిక్రమ్‌తో చేయనున్న కొత్త చిత్రం వచ్చే ఏడాది ప్రధమార్ధంలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంవత్సరం తారక్‌ నుంచి ముచ్చటగా మూడో చిత్రం చూసే అవకాశమూ ఉంది. తమిళ దర్శకుడు వెట్రి మారన్‌తో తారక్‌ ఓ సినిమా చేయనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

'వడ చెన్నై', 'అసురన్‌' వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్ ఎన్టీఆర్‌ కోసం ఓ చక్కటి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడని, ఇప్పటికే ఈ విషయమై తారక్‌తో ఓ దశ చర్చలు కూడా జరిపాడని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లోనే చిత్రాన్ని పట్టాలెక్కించి వచ్చే ఏడాది ద్వితియార్ధంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడట.

త్రివిక్రమ్‌ చిత్రం ఆలస్యమైతే వచ్చే ఏడాది ప్రధమార్ధంలో సినిమా పట్టాలెక్కనుంది. మరి వెట్రి మారన్‌కు తారక్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

ఇదీ చదవండి:మరోసారి తెరపై చిట్టిబాబు, రామలక్ష్మి సందడి..!

Last Updated : Mar 1, 2020, 1:17 AM IST

ABOUT THE AUTHOR

...view details