డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌గా కెరీర్ ప్రారంభించి, హాలీవుడ్లో ఆకట్టుకుంటున్న ప్రముఖ నటుడు డ్వేన్ జాన్సన్.. ఏకంగా తన ఇంటి ద్వారాలనే విరగ్గొట్టాడు. విద్యుత్ అంతరాయం వల్ల అవి తెరుచుకోలేదు. దీంతో తన కోసం ప్రొడక్షన్ సిబ్బంది ఎదురుచూస్తున్నారని, తనే స్వయంగా ఆ గేటును పెకలించుకుని షూటింగ్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
"బహుశా ఈ రోజు నాకు మంచి రోజు కాదేమో. తుఫాను కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో మా ఇంటి గేట్ తెరుచుకోలేదు. ద్వారాలను తెరిచేందుకు హైడ్రాలిక్ వ్యవస్థను ఉపయోగించి చూశా కానీ కుదరలేదు. వెంటనే కొంతమందికి ఫోన్ చేసి గేటును ఎంత త్వరగా ఓపెన్ చేయొచ్చే అడిగి తెలుసుకున్నా. సుమారు 45 నిమిషాలు పడుతుందని చెప్పారు. కానీ, నా కోసం చాలా మంది ప్రొడక్షన్ సిబ్బంది ఎదురుచూస్తున్నారు. అందుకే గేటును పూర్తిగా నెట్టి, లాగి, పెకలించేశాను"